రోజు రోజుకి పెరిగిపోతున్న ఎన్టీఆర్ క్రేజ్

గత కొంతకాలంగా సరైన హిట్టు సినిమా లేక భాదపడిన ఎన్టీఆర్ టెంపర్ సినిమా తో హిట్  ట్రాక్ లోకి ఎక్కి దూసుకెళ్తున్నాడు. అయితే సినిమా రంగంలోనే కాక టెలివిజన్ రంగంలో కూడా బిగ్ బాస్ షో లో అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో అలరించాడు హీరో ఎన్టీఆర్. అయితే ఈ నేపథ్యంలో తాజాగా మరో పెద్ద కార్యక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారని సమాచారం. స్టార్ టివి ఈ ఏడాది స్పోర్ట్స్ ఈవెంట్స్ తో భారీ స్థాయిలో బిజినెస్ ను ప్లాన్ చేసుకుంది.

ఐపీఎల్, ప్రో కబడ్డీ లీగ్ లకు ఆదరణ చాలా పెరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే రెండింటికి సంబంధించిన ప్రమోషన్స్ లలో తెలుగు సైడ్ నుంచి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ మా త్వరలో ఎన్టీఆర్ తో ప్రోమోస్ రెడీ చేయటానికి చూస్తోంది. అంతా పూర్తయిన తరువాత టెలికాస్ట్ చేస్తారట. ఈ రెండు వర్కౌట్ అయితే ఎన్టీఆర్ రేంజ్ ఇంకా పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

క్రికెట్ అంటే మనవాళ్లకు చాలా పిచ్చి. ఆ అభిమానులను తెలివిగా ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి దక్కించుకున్నారు, అంటే చాలు ఎన్టీఆర్ హోదా ఇంకా పెరుగుతుంది. దీంతో ఎన్టీఆర్ రేంజ్ అమాంతం పెరిగింది అని చెప్పవచ్చు …ఏదిఏమైనా తారక్ క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతుంది. ప్రస్తుతం తారక్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కోసం రెడీగా ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here