అతను చేసిన పనికి పెళ్లి చేసుకోలేక పోయా: హీరోయిన్ ఛార్మి

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ చార్మి ఒకప్పుడు మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. అప్పట్లో ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరి పక్కన నటించింది. అయితే గత కొంతకాలంగా సరైన విజయాలు లేక అవకాశాలు కూడా దూరమయ్యాయి. అయితే ఈ క్రమంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది.  ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన పెళ్లి ప్రస్తావన వచ్చినపుడు తన జీవితంలో జరిగిన సంచలన విషయాలు గురించి బయట పెట్టింది.

ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డానని, రెండు విషయాల వల్ల తమ ప్రేమ విఫలమైందని చెప్పింది. ఒకవేళ, అతన్ని తాను పెళ్లి చేసుకున్నట్టయితే అతని ప్రవర్తన కారణంగా తాము విడాకులు తీసుకునే పరిస్థితి ఏర్పడేదని తెలిపింది. అయితే, అతను మంచివాడేనని, తానే చెడ్డదానినని చెప్పడం గమనార్హం. పెళ్లి చేసుకోమని తనపై తన తల్లి ఒత్తిడి చేస్తూ ఉంటుందని, రిలేషన్ షిప్ లో సరిగ్గా ఇమడలేని తాను పెళ్లి చేసుకుని ఏం సాధిస్తానని చెప్పింది.

ఒకవేళ తాను పెళ్లి చేసుకున్నా తన భర్త కోసం సమయం కేటాయించలేనని, ఇంటి పనులు చూసుకోలేనని ఛార్మి స్పష్టం చేసింది. ఈ రోజుల్లో పెళ్లి చేసుకొని సంసారాలు ఎంతమంది కరక్ట్ గా చేస్తున్నారు అంటూ ప్రశ్నించింది. మొత్తం మీద తన జీవితంలో పెళ్లికి చోటు లేదు అని చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here