మేమంతా తెరమీద హీరోలం వైయస్ జగన్ రియల్ హీరో: హీరో నిఖిల్

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో నిఖిల్ వైసిపి అధినేత జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన తాజా చిత్రం కిర్రాక్ పార్టీ విడుదలై ఈ విజయం సాధించడంతో ఓ ప్రముఖ టీవీ న్యూస్  ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నిఖిల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మ‌ధ్య ఫేస్‌బుక్‌లో వైఎస్ జ‌గ‌న్‌ని చూస్తే రియ‌ల్ హీరోని చూసిన‌ట్లు ఉంద‌ని మీ ఫేస్‌బుక్‌లో కామెంట్ చేశారు క‌దా..!! దానిపై మీ వివ‌ర‌ణ అని ఇంట‌ర్వ్యూ చేసే వ్య‌క్తి అడుగ‌గా, వైఎస్ జ‌గ‌న్ అంటే రాజ‌కీయంగా నాకు అభిమానం.
ఆయ‌న చేస్తున్న పాద‌యాత్ర సూప‌ర్బ్ అంటూ త‌న దైన శైలిలో చెప్పారు హీరో నిఖిల్‌. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా వైఎస్ జ‌గ‌న్ ప్ర‌తీ ఊరికి ఓపిగ్గా వెళ్లి, ప్ర‌తీ ఒక్క‌రిని క‌లిసి మాట్లాడ‌టం గొప్ప విష‌య‌మ‌న్నారు. ఎవ‌రైనా రెండు రోజులు న‌డిస్తేనే అలిసిపోతారు… అటువంటిది వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల కోసం వంద‌ల రోజులు… వేల‌కొద్ది కిలోమీట‌ర్లు న‌డుస్తుండ‌టం గొప్ప విష‌య‌మ‌ని చెప్పారు హీరో నిఖిల్‌. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here