ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం చంద్రబాబుకు ఇష్టం లేదు సినీ నటి కవిత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసింది సినీ నటి కవిత. గత సార్వత్రిక ఎన్నికలలో ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అలాగే ప్రత్యేక హోదా అయిదేళ్ళు కాదు పదిహేనేళ్ళు కావాలని చెప్పడం జరిగింది చంద్రబాబు. అయితే తర్వాత అధికారంలోకి వచ్చాక ఓటుకు నోటు కేసులో దొరికిపోయి కేంద్రం చేతిలో ఇరుక్కుపోయిన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా అంశాన్ని పక్కదోవ పట్టించారు చంద్రబాబు.ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ప్ర‌త్యేక హోదా ఏమ‌న్నా సంజీవ‌నా..? కేంద్ర ప్రభుత్వం ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తానంటే హోదా కావాలంటారా..? కోడ‌లు మగ బిడ్డ‌ను కంటానంటే.. అత్త వ‌ద్దంటాదా..? అంటూ ఏపీకి ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం లేద‌నే రీతిలో చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

చంద్ర‌బాబు ఇలా ప్ర‌త్యేక హోదాపై మాట్లాడుతుండ‌గా తీసిన వీడియో క్లిప్పిగ్స్ ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుపై సినీ న‌టి క‌విత చేసిన వ్యాఖ్య‌లు టీడీపీ వ‌ర్గాల్లో ఆందోళ‌న‌ను నెల‌కొల్పాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌త్యేక హోదాపై చంద్ర‌బాబు వైఖ‌రి బ‌హిర్గ‌తంగా అంద‌రికీ తెలిసిన విష‌య‌మే అయిన‌ప్ప‌టికీ, టీడీపీ వ‌ర్గాలు మాత్రం వాటిని ఖండిస్తూ వ‌చ్చాయి. అయితే, సినీ న‌టి క‌విత చేసిన వ్యాఖ్య‌ల‌తో చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదా అంశంపై అవలంభిస్తున్న వైఖ‌రి ప్ర‌స్పుటంగా బ‌హిర్గ‌త‌మైంది. అలాగే ఇటీవల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సమావేశంలో కూడా చంద్రబాబు ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడవద్దని అన్నారని కూడా బయటకు వార్తలు రావడం జరిగింది….అయితే తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలు నిజంగా స్పష్టమే అని అర్థమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here