ఆ అమ్మాయితో తిరిగి కెరీర్ ను నాశ‌నం చేసుకోకు పాండ్యా

మొన్న ప‌రిణీతి చోప్రా..నిన్న మ‌రో అమ్మాయి. ఏంట‌మ్మా విష‌యం. భోజ‌నం ఎప్పుడు పెడుతున్నావు. అమె మా వ‌దిన క‌దూ అంటూ  టీమిండియా నయా ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య ను నెటిజ‌న్లు ఆట‌ప‌ట్టిస్తున్నారు. మ‌రికొంత‌మంది చుర‌క‌లంటిస్తున్నారు. ఆస్ట్రేలియాపై విజ‌యం సాధించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ను ద‌క్కించుకున్న పాండ్య అమ్మాయిల‌తో సాన్నిహిత్యంగా ఉంటున్నాడు.

తాజాగా రెస్టారెంట్లో ఓ అమ్మాయితో దిగిన సెల్ఫీల‌ను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు .  అంతే ఈ ఫోటోల‌పై నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు. టీంమిడియా త‌రుపున అన్నీ ఫార్మాట్లలో ప్ర‌త్యేక‌గుర్తింపు తెచ్చుకున్న పాండ్య పేరు దేశం మొత్తం మారు మ్రోగుతుంటే..ఇత‌గాడు మాత్రం అమ్మాయిల‌తో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నాడు. దీనిపై క్రికెట్ అభిమానులు మండిప‌డుతున్నారు.

మంచి జీవితాన్ని నాశ‌నం చేసుకోకు. భ‌విష్య‌త్ ఇండియ‌న్ టీం కెప్టెన్ బాధ్య‌తలు చేప‌ట్టాల్సిన నువ్వే ఇలా ఆ అమ్మాయి వెనకాల పడి కెరీర్ నాశనం చేసుకోకు’ అంటూ ట్విట్ చేస్తున్నాడు. మొత్తానికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ అందుకున్న మరుసటి రోజే పాండ్య మరోసారి వార్తల్లోకెక్కాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here