చీ..చీ ప‌వ‌న్ క‌ల్యాణ్ నేను ఆ పాడు ప‌నిచేయ‌లేదు | రేణుదేశాయ్

ప‌వ‌న్ తో  విడిపోయిన రేణుదేశాయ్ మ‌రాఠి సినిమాల‌కు నిర్మాత‌గా మారారు. నిర్మాత‌గా, డైర‌క్ట‌ర్ గా మంచి మార్కులే కొట్టేసింది. దాదాపు చాలా కాలం త‌రువాత తెలుగులో నీతోనే డాన్స్ – రియ‌ల్ క‌పుల్ డాన్స్ , రొమాన్స్ షో హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈనేప‌థ్యంలో రేణు మీడియాకిచ్చిన ఇంట‌ర్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వెల్ల‌డించారు.

ప‌వ‌న్ వ‌ద్ద‌నుంచి భారీ మొత్తంలో డ‌బ్బులు తీసుకున్నార‌ని, ఆ డ‌బ్బుల‌తో మ‌రాఠీ సినిమాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వ‌చ్చిన వార్త‌ల‌పై ప్ర‌శ్నించ‌గా ప‌వ‌న్ తో తాను పాడు పని చేయ‌లేద‌ని..తాను 15ఏట మోడ‌లింగ్ లో కెరిర్ స్టార్ట్ చేసిన‌ట్లు చెప్పారు. అలా 19ఏట లో సొంతంగా ఓ ఫ్లాట్ ను కొనుగోలు చేసిన‌ట్లు చెప్పుకొచ్చారు.

అంతేకాదు తండ్రి రియ‌ల్ ఎస్టేట్ రంగంలో మంచి పేరున్న వ్య‌క్తి అవ్వ‌డం వ‌ల్ల తాను సంపాదించిన డ‌బ్బుల్ని రియ‌ల్ ఎస్టేట్ రంగంలో, మ్యూచివ‌ల్ ఫండ్స్ లో పెట్టుబ‌డులు పెట్టాన‌ని, అవి భారీగా లాభాలు తెచ్చిపెట్ట‌డంతో నిర్మాత‌గా మారాన‌ని అన్నారు. అంతేకాని ప‌వ‌న్ ద‌గ్గ‌ర భారీ మొత్తంలో డ‌బ్బులు తీసుకున్నట్లు వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేద‌ని వెల్ల‌డించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here