హీరో నానీ – నాగార్జున మల్టీ స్టారర్ పక్కా అయ్యింది .. అఫీషియల్ గా చెప్పింది ఎవరో కాదు

వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఓ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో నాగార్జున .. నాని కలిసి నటిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇది వాస్తవమేనని తాజాగా నాగార్జున స్పష్టం చేశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తాను మల్టీస్టారర్ మూవీ చేయనుండటం నిజమేనని అన్నారు.
 ఈ సినిమాలో నాని పాత్ర ఎంతో సరదాగా సాగిపోతుందని చెప్పారు. ఇక తన పాత్ర కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అన్నారు. అభిమానులందరినీ ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని చెప్పారు. గతంలో శ్రీరామ్ ఆదిత్య ‘భలే మంచిరోజు’ .. ‘శమంతకమణి’ సినిమాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తెరకెక్కించనున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి మొదలవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here