మళ్ళీ దవడ పగల గొట్టిన బాలయ్య .. ఈ సారి ఎవరిని కొట్టాడు

ప్రముఖ న‌టుడు, ఎమ్మెల్యే బాల‌కృష్ణ మరోసారి అసహనాన్ని ప్రదర్శించారు. త‌న మీద‌కి వ‌స్తున్నాడ‌నే కారణంతో తెలుగు దేశం పార్టీ కార్య‌క‌ర్త చెంప‌ను చెళ్లుమ‌నిపించారు. హిందూపురంలోని బోయపేటలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్న సందర్భంలో ఈ ఘటన జరిగింది.
ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ ఇంట్లోకి వెళుతుండగా.. బాలయ్య కంటే ముందు ఓ కార్యకర్త వెళ్లడానికి ప్రయత్నించాడు. దీంతో బాలయ్య అసహనంతో ఆ కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. ఎందుకంత తొందరంటూ అతనిని వారించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here