అమెరికాలోని లాస్‌వెగాస్ మ్యూజిక్ ఫెస్ట్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. అభిమానుల్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల్లో 50పైగా మృతి చెందగా 100కి పైగా గాయపడ్డారు. కాల్పుల్లో బాధితులు ఆర్తనాదాలు చేస్తుంటే నిందితులు మాత్రం రాక్షసానందాన్ని పొందుతూ విచ్చలవిడిగా కాల్పులు జరిపారు.
అయితే సమాచారం అందుకున్న పోలీసులు కొన్ని గంటలపాటు ఆ ప్రాంతాన్ని తమ ఆదీనంలోకి తెచ్చుకొని నిందితుల్ని కనిపెట్టే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో అమాయకులపై కాల్పులు తెగబడ్డ నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
లాస్‌వెగాస్‌కు చెందిన 64 ఏళ్ల స్టీవెన్ పడాక్గా గుర్తించారు. హోటల్ 32వ అంతస్తులో అత్యంత శక్తివతమైన అస్సాల్ట్ రైఫిల్‌తో కాల్పులు జరపడంతో ఇంత దారుణం జరిగిందని పోలీసులు గుర్తించారు.