విచిత్రం హాన్స్ ప్రాణం తీసిన త‌న పొడ‌వైన గ‌డ్డం

మీకు ఓ సామెత గుర్తుందా. అదృష్టం ద‌రిద్రం ప‌ట్టిన‌ట్లు ప‌డితే అర‌టిపండుతిన్న ప‌న్ను ఇరిగిపోతుంద‌ని. పెద్దోళ్లు ఊరికే చెప్ప‌రు. ప్ర‌తీ సామెతలో ఓ అర్ధాన్ని వివ‌రిస్తారు.అయితే పెద్ద‌లు చెప్పిన ఈ సామెత అమెరికా వ్య‌క్తికి అచ్చ‌గుద్దిన‌ట్లు స‌రిపోతుంది. ఈయ‌న స్టోరీ చ‌దివిన త‌రువాత. ప్ర‌పంచంలో ఇలాంటి వింతైన చావు ఉంటుందా అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తారు. అది అలాంటి ఇలాంటి చావు కాదు. మ‌ర‌ణం అంటే ప్ర‌మాద‌వ‌శాత్తు కొన్ని విప‌త్క‌ర ప‌రిస్థితిల్లో ఎదుర‌వుతుంది దాన్ని ఎవ‌రు ఆప‌లేరు.

కానీ ఈవ్య‌క్తి త‌న చావుకు తానే కార‌ణ‌మ‌య్యాడు. ఇంత‌కీ అదెలా సాధ్య‌మైందంటే…?
హన్స్ లాంగ్ సేత్ అనే అమెరికాకు చెందిన రైతు ప్ర‌పంచంలో ఏదైనా రికార్డులు సాధించాల‌ని క‌ల‌లు క‌నేవాడు. త‌న‌కున్న పరిదిలో ఏం చేస్తే రికార్డులు సాధించ‌వ‌చ్చు అని ఆలోచించ‌గా మెద‌డ‌లో ఓ మెరుపులాంటి ఐడియా త‌ట్టింది. అదేంటంటే పైసా ఖ‌ర్చులేకుండా రికార్డు సాధించాలంటే త‌న గ‌డ్డాన్ని ప్రప్రంచంలోనే అత్యంత పొడ‌వైన గ‌డ్డంగా పెంచుకొని త‌ద్వారా చ‌రిత్ర‌లో నిలిచిపోవాల‌నే అనుకున్నాడు.

అంతే 5.33 meters (17.5 ft) పొడ‌వుతో త‌న గ‌డ్డాన్ని పెంచాడు. అయితే ఈ గ‌డ్డ‌మే త‌న ప్రాణాల్ని తీస్తుంద‌ని ఊహించ‌ని హాన్స్ ఓ రోజు ఉన్న‌ట్లుండి హ‌ఠాత్తుగా భ‌యంక‌ర‌మైన గాలి సంభ‌వించిది ఈ గాలినుంచి త‌న‌ను కాపాడుకోవాల‌నే ఉద్దేశంతో సుర‌క్షిత ప్రాంతానికి కాలిన‌డ‌క‌న వెళుతున్నాడు. ఆ స‌మ‌యంలో త‌న పొడ‌వైన గ‌డ్డాన్ని తొక్కాడు. అంతే ఒక్క‌సారిగా త‌న గ‌డ్డంమీద కాలు వేసిన హన్స్ వెన‌క్కి విర‌గబ‌డ్డాడు. పాపం దీంతో అత‌ని వెన్నుపూస విరిగి అక్క‌డికక్క‌డే క‌న్నుమూశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here