పాక్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సీఎం యోగి ఆధిత్య‌నాథ్

పాక్ పై యూపీ సీఎం యోగి ఆధిత్య‌నాథ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. యూపీ అంటే ఠ‌క్కున గుర్తొచ్చేది సీఎం యోగి ఆధిత్య‌నాథ్. సీఎం గా ప‌ద‌వి బాధ్య‌త‌లు చేప‌ట్టిన క్ష‌ణం నుంచి రాష్ట్రంలో ఎవ‌రు చేయ‌నుటువంటి సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ నిర్ణ‌యాలు యోగిని ప‌చ్చి హిందుత్వ‌వాదిని చేశాయి. ప్ర‌జాశ్రేయ‌స్సే ప‌ర‌మావ‌దిగా ఉన్న నాకు ప్ర‌తిప‌క్షాలు ఏం ఆపాదించిన వాటిని కేర్ చేయ‌కుండా త‌న‌ప‌ని తాను చేసుకుంటూ వెళ్లి పోతానంటూ ఫైర్ అయిన సంద‌ర్భాలు ఉన్నాయి .

ఈనేప‌థ్యంలో జేడీయూ ఆధిత్యానాథ్ ను ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేసింది.  గై.. గంగ… గోరక్షక్ ఈ నినాదాలతో ఆరెస్సెస్ కు కొమ్ము కాస్తున్నారంటూ విమ‌ర్శ‌లు చేసింది. అదే రీతిలో రియాక్ట్ అయిన  ఈ స‌న్యాసి రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ లేకుంటే   దేశంలోని ప్రధాన భూభాగం పాక్ లో కలిసిపోయి ఉండేదని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశానికి నిస్వార్ధంగా ప‌నిచేస్తున్న ఆరెస్సెస్ కీల‌క‌ నేత డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కనుక లేకుంటే పంజాబ్, జమ్ముకశ్మీర్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు పాకిస్థాన్‌లో అంతర్భాగం అయి ఉండేవన్నారు.

అంతేకాదు ఆర్ ఎస్ ఎస్ సేవ‌ల్ని కొనియాడుతు ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి సాయం ఆశించ‌కుండా నిస్వార్ధంగా ప‌నిచేస్తుంటే జేడీయూ ఈ త‌ర‌హ కామెంట్ చేయ‌డం త‌గ‌ద‌ని చుర‌క‌లంటించాడు. అయితే దీనిపై స్పందించిన బీజేపీ శ్రేణులు విభిన్న సాంస్కృతిక సాంప్ర‌దాయాలు క‌లిగిన రాష్ట్రాలు దాయాది దేశం పాలు కాకుండా కాపాడిన ఆర్ఎస్ఎస్ తో స్నేహం చేయటం తప్పేం కాదని వ్యాఖ్యానించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here