గంజాయి వ‌ల్ల మ‌రో ప‌దేళ్లు ఎక్కువ‌గా బత‌కొచ్చ‌ట‌

కొంత మంది థ‌మ్ మారో థ‌మ్ అంటూ మ‌త్తుపానీయాలు సేవించి మ‌త్తులో ఊగిపోతుంటారు. అదే వ్య‌స‌నంగా మారిన కొంద‌రు చావుకు సెండాఫ్ ఇచ్చివ‌స్తుంటారు. అందుకే  మ‌త్తు ప‌దార్ధాల‌కు దూరంగా ఉండాల‌ని  హెచ్చ‌రిస్తుంటారు. అలాంటి మ‌త్తు ప‌దార్ధాల కోవ‌కు చెందిన గంజాయి మెద‌డును మంచిని క‌లిగిస్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. గంజాయి వ‌ల్ల మాన‌వ‌శరీరానికి ఎలాంటి న‌ష్టాన్ని క‌లిగిస్తుంద‌నే దానిపై ప‌రిశోద‌నలు జ‌రిపిన బాన్ యూనివ‌ర్సిటీ, హెబ్రూ యూనివ‌ర్సిటీకి చెందిన వైద్యులు ప‌లు ఆస‌క్తిక‌ర విషయాల్ని వెలుగులోకి తీసుకు వ‌చ్చారు. త‌గినంతా గంజాయిని తాగితే మెద‌డు ఆరోగ్యం ప‌నిచేస్తుంద‌ని, ప‌దేళ్లు ఎక్కువ బ్ర‌త‌కొచ్చ‌న‌ని అంటున్నారు.
తొల‌త ఈ ప్ర‌యోగాన్ని ఎలుక‌ల‌పై ప్ర‌యోగించ‌గా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన రీతిలో వాటి ఆరోగ్యంగా చురుగ్గా ఉన్నాయ‌ని , ఆ త‌రువాత మ‌నుషుల‌పై ప్ర‌యోగిస్తే అదే రిజ‌ల్ట్ వ‌చ్చింద‌ని సూచించారు. క‌న్నాబినాయిడ్స్ అనే ర‌సాయ‌నాలు గంజాయిలో ఉండ‌టం వ‌ల్ల పెద్ద‌వాళ్ల మెద‌డు ప‌నితీరు బాగుంద‌ని, చిన్న పిల్ల‌లు ఆరోగ్య‌ప‌రంగా చిక్కులు ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. గంజాయి ప్ర‌భావం ఇత‌ర అవ‌య‌వాల మీద ఎటువంటి ప్ర‌భావాన్ని చూపుతుంది అనే దానిపై పూర్తి స్థాయిలో ప‌రిశోద‌న‌లు జ‌ర‌పాల‌ని యూనివ‌ర్సిటీకి చెందిన ప‌రిశోద‌కులు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here