రూపాయి సింబ‌ల్ డిజైన్ చేసిన వ్య‌క్తి గురించి తెలుసుకుందాం

ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్ లో మ‌నీకి ఎంత వ్యాల్యూ ఉందో మ‌నుషుల‌కి కూడా లేదు. అటువంటి రూపాయి సింబల్ ఎవ‌రు త‌యారు చేశారు. ఆ సింబల్ ఎలా డిజైన్ చేశారు. అనే విష‌యాన్ని తెలుసుకుందాం. మ‌న‌కు తెలిసి ఇండియ‌న్ క‌రెన్సీ Rs  అనే అక్ష‌రాల్లో వాడుక‌లో ఉండేది. అయితే రానురాను దాన్ని మార్చివేసి దేవ‌నాగ‌రి లిపి తో కొత్త రూపాయి సింబ‌ల్ ను ప్రాచుర్య‌లంలో తీసుకువ‌చ్చారు. ఈ లోగో మార్చ‌డానికి పెద్ద క‌స‌ర‌త్తే జ‌రిగింద‌ని కొత్త రూపాయి డాల‌ర్ సింబ‌ల్ ను సృష్టిక‌ర్త ఐఐటీ విద్యార్ధి ఉద‌య్ కుమార్ తెలిపారు.
డిజైన్ మార్చాల‌ని  కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.  Rs ను మార్చి స‌రికొత్త డిజైన్ తో అందుబాటులోకి తీసుకురావాల‌ని తెలిపింది. ఇందుకోసం ప్ర‌పంచ వ్యాప్తంగా ఔత్సాహికులైన వారితో డిజైన్ రూప‌క‌ల్ప‌న చేయించింది. అలా దేశం మొత్తం మీద 3వేల మంది పోటీప‌డ‌గా 5మంది ఎంపిక‌య్యారు. అందులో త‌మిళ‌నాడు రాష్ట్రం క‌ల్ల‌కురించి గ్రామానికి చెందిన ప్ర‌స్తుత ఐఐటీ ప్రొఫెస‌ర్ ఉద‌య్ కుమార్ విజ‌యం సాధించారు.
దేవనాగరి లిపి నుండి ‘ర’ను, రోమన్ గుర్తు ‘ఆర్’ ను కలగలిపి ఈ కొత్త డిజైన్ సృష్టించాడు. ఈ సింబ‌ల్ ను దేశ మొత్తం మ‌ద్ద‌తు ప‌లికింది. ఉద‌య్ కుమార్ కు వేత‌నం తో పాటు అత్య‌న్నుత హోదా క‌లిగిన ప్ర‌భుత్వం ఉద్యోగం ఆఫ‌ర్ ఇచ్చింది. కానీ ఈ ఆఫ‌ర్ తిర‌స్క‌రించిన ఉద‌య్ త‌న‌కిష్ట‌మైన విద్యాబోద‌నలో కొన‌సాగుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here