పిల్లల్ని కనమంటే .. తల్లులందరూ నో నో అంటున్నారు !

ప్రపంచం మొత్తం మీద అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ దేశం లో రోజు రోజుకీ వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. రెండు సంవత్సరాల క్రితం మీదనే ఆ దేశం లో పిల్లలని కనడం మీద ఉన్న నిభందనలు ఎత్తేసారు. ఇలా చెయ్యడం వలన వృద్ధులు పెరుగుతున్నారు .. ఇది చైనా భవిష్యత్తు ని సర్వ నాశనం చేస్తోంది సో ఇద్దరు పిల్లలని కనండి అంటూ పిలుపు ఇస్తోంది ప్రభుత్వం. కానీ జనాలు మాత్రం ఎట్టి పరిస్థితి లో ఇద్దరేసి పిల్లలని కనే లాగా కనపడ్డం లేదు.

ఝాఫిన్‌.కామ్‌ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఉద్యోగినుల్లో పిల్లలు కనాలన్న ఆలోచనే లేదని గుర్తించింది. ఉద్యోగాలు చేస్తున్న మహిళలు తమ కెరీర్ కు పిల్లలు ఇబ్బందికరమని భావిస్తున్నారు. నలభై శాతం మంది చైనా మహిళలు పిల్లల్ని కనాలి అనుకోవడమే లేదట.  33 శాతం మహిళలు తల్లులైన తరువాత వారి వేతనంలో కోతలు పెరిగాయి. అలాగే, 36 శాతం మంది ప్రమోషన్లు కోల్పోయారని, పలువురు తక్కువ స్థాయి పదవికి డీమోట్‌ కూడా అవుతున్నారని, సంతానం విషయంలో విశాలంగా ఆలోచించకపోవడానికి, పిల్లల్ని పెంచడంలో వున్న ఇబ్బందులు కూడా ఒక కారణమని వ్యాపారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here