చలపతిరావు నీకు సిగ్గుందంటయ్యా..ఆడవాళ్ల అంటే పక్కలో పడుకోవడమేనా

ముసలోళ్లకి దసరా పండగ అవసరమా అన్నట్లు సీనియర్ నటుడు చలపతిరావు కు ఈ మాటలు అవసరమా అని జనాలు తిట్టిపోస్తున్నారు. పెద్దమనిషన్నోడు కొంచెం హుందాగా ఉండాలా..లేదంటే అన్నీ మూసుకొని కూర్చోవాలి. ఇలా మాట్లాడితే గౌరవించరు సరికాదా రాళ్లొచ్చికొట్టేస్తారని నెటిజన్లు మండిపడుతున్నారు. పెద్దోడు కదా అని ఆడియో ఫంక్షన్ కి పిలిస్తే ఆడోళ్ల గురించి నీచంగా మాట్లాడి పరువుపోగొట్టుకున్నాడు.

అక్కినేని నాగచైతన్య నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా ఆడియో ఫక్షన్ అట్టహాసంగా జరిగింది.  ఈ సందర్భంగా ఆడవారి పై విలక్షణ నటుడు చలపతిరావు జుగుప్సాకరంగా మాట్లాడారు. ఆడియో వేడుకలో ముందు వరుసలో కూర్చున్న ఈ పెద్దాయన్ని యాంకరమ్మ ఓ ప్రశ్న అడిగింది. అమ్మాయిలు మనశ్మాంతికి హానికరమా అని ప్రశ్నిస్తే …ఎవరైనా ఏం సమాధానం చెబుతారు. నవ్వడమో. ఏదో ఒకటి చెప్పి పక్కకు తప్పుకుంటారు.

కానీ ఈయన గారు మాత్రం అమ్మాయిలు హానికరం కాదు కానీ… పక్కలోకి పనికొస్తారు??? అని పబ్లిక్ గానే కామెంట్ చేశాడు. అంతే పక్కనే వెకిలి చేష్టలు చేస్తున్న యాంకర్ రవి ఓ నవ్వు నవ్వి సూపర్ ఆన్సర్ అంటూ ఎంకరేజ్ చేశాడు. ఈ కామెంట్లపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు. పెద్దమనిషి సిగ్గూ ఎగ్గు లేకుండా ఆడవాళ్ల గురించి ఇలా కామెంట్ చేయడం ఏంటని దుమ్మెత్తిపోస్తున్నారు. అంతేకాదు చలపతిరావు మహిళలకు క్షమాపణలు చెప్పాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here