శ్రీవారి భక్తులకు జీఎస్టీ సెగ..పెరిగిన రేట్లు ఇలా ఉన్నాయి.

  వెంకన్న  దర్శనం ఇక సంపన్నులకు కాస్త భారం కానుంది…ఇవాల్టి నుంచి జిఎస్టీ రేట్లు అమల్లోకి వస్తున్నాయి.  వెయ్యి రూపాయలకు మించిన ఖరీదున్న అద్దెగదులు తీసుకున్న వారిపై జీఎస్టీ భారం బాగా పడనుంది. మధ్యతరగతి, పేద వర్గాలపై ఈ ప్రభావం పడక పోయినా.. సంపన్న వర్గాలు ఇక వడ్డి కాసుల వాడిని చూడాలంటే.. ఖర్చు చేయాల్సిందే..
 శ్రీవారి భక్తులకు జీఎస్టీ సెగ తగిలింది. జీఎస్టీ ఎఫెక్ట్ తో గదుల అద్దె భారీగా పెరిగింది. వెయ్యి రూపాయలకు పైగానున్న అద్దె గదులకు జీఎస్టీని వర్తింపచేస్తున్నారు. రెండు వేల రూపాయల లోపు అద్దె గదులకు 12 శాతం, 2 వేల కంటే ఎక్కువ ఉన్న గదులకు 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు.
 సవరించిన రేట్ల ప్రకారం…పదిహేను వందల అద్దె గదికి..జీఎస్టీ12 శాతం కలిపితే 17 వందల రూపాయలు అయ్యింది. 2 వేల అద్దె గదికి జీఎస్టీతో కలిపితే, 2 వేల 2 వందలు చెల్లించాలి. ఇక 2 వేల 5 వందలు ఉన్న అద్దె గది ధర..18 శాతం జీఎస్టీతో కలిపి 3 వేలకు చేరింది. 3 వేల రూపాయల గది 3 వేల 5 వందలకు…3,500 గది 4,100 అయ్యింది. 4 వేల అద్దె గది 4,700కి పెంచారు.  4,500 రెంట్ కి 5,300 చెల్లించాలి. 6 వేల అద్దెను 18 శాతం జీఎస్టీతో కలిపితే 7 వేల ఒక వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వెయ్యి రూపాయలలోపు ఉన్న  అద్దె గదులకు జీఎస్టీ వర్తించదనీ..దీంతో సామాన్య భక్తులపై ఎలాంటి భారం ఉండదని టీటీడీ అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here