సాయి బాబా గుడిలో కాళ్లు కడిగించుకున్న ముఖ్యమంత్రి

అధికారం ఉంద‌నే అహంకారంతో నేత‌లు చెల‌రేగిపోతున్నారు.  అధికార దిక్క‌రంతో ఎప్పుడు ఏదో ఒక‌టి అల‌జ‌డిసృష్టించే నేత‌లు దేవాలయాల్లో అదే త‌ర‌హాగా ప్ర‌వ‌ర్తించి వివాదంలో చిక్కుకుంటున్నారు. తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్  జంషెడ్‌పూర్‌లోని బ్రహ్మలోక్‌ధామ్‌లో సాయిబాబాదేవాల‌యంలో గురు మహోత్సవ్ వేడుకల‌కు ముఖ్య అతిధిగా హాజ‌రయ్యారు. సాదార‌ణంగా దేవాల‌యాల్లో భ‌క్తులు దేవుళ్ల‌ని  ఎలా ద‌ర్శించుకుంటారు.  పీఎం అయిన సీఎం అయినా సాద‌ర‌ణంగా గుడి భ‌య‌ట కాళ్లు క‌డుక్కొని  నిష్ట‌నియ‌మాలు క‌ట్టుబాట్ల‌తో దేవుళ్ల‌ని ద‌ర్శించుకుంటారు.

కానీ ర‌ఘుబ‌ర్ దాస్ అలా కాకుండా ఏకంగా సాయిబాబా గుడిలో ఇద్దరు మహిళల‌తో  కాళ్లు కడిగించుకున్నాడు. సీఎం చేసిన ఘ‌న‌కార్యం గురించి ఓ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవ్వ‌డంతో ప్ర‌తిప‌క్షాలు, భ‌క్తులు మండిప‌డుతున్నారు. దేవాల‌యంలో మ‌హిళ‌ల‌తో కాళ్లుక‌డిగించుకోవ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు ర‌ఘుబ‌ర్ దాస్ చేసిన త‌ప్ప‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here