నా న్యూడ్ వీడియోలు పంపుతున్నా.. వాటితో ‘డ్రగ్స్’ కొనివ్వరా… ప్లీజ్

హైదరాబాద్ లో డ్రగ్స్ దందాను భయటపెట్టిన పోలీసులకు కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా డ్రగ్స్ కు అలవాటుపడిన కాలేజీ విద్యార్ధులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు డబ్బుతో విచ్చలవిడిగా మత్తుపదార్ధాల్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే సమాచారం అందుకు నార్కోటిక్ పోలీసులు సోదాలు చేయగా కొంతమంది నిందితుల్ని, వారి వద్దనుంచి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు.హాంకాంగ్, గోవానుంచి హైదరబాద్ కు డ్రగ్స్ తరలించి వ్యాపారం నిర్వహిస్తున్నట్లు ఒప్పుకున్నారు.

హైదరాబాద్ లో వ్యాపారం కోసం ఓ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో బేరసారాలు జరిపినట్లు చెప్పారు. వీటిల్లో కొన్ని నగ్నవీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. డ్రగ్స్ కు అలవాటుపడిన ఓ యువతి ఏకంగా తన న్యూడ్ వీడియోల్ని పంపింది. డ్రగ్స్ పై ఉన్న పిచ్చితో తనదగ్గర డబ్బులేదని, కావాలంటే నా నగ్నవీడియోల్ని పంపుతున్నట్లు, వాటిని అమ్మి వచ్చిన డబ్బులతో మత్తు పదార్దాల్ని పంపండి అంటూ షేర్ చేసింది.

ఈ వీడియోల్ని చూసిన అధికారులు కంగుతిన్నారు. ఈ డ్రగ్స్ దందాలో ఇంకెంత మంది అమ్మాయిలు ఉన్నారో..వారిని రక్షించేందుకు చర్యలు తీసుకున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.  అంతేకాదు కిట్టీపార్టీల పేరుతో ధనవంతులకు విందులు ఏర్పాటు చేసి వారికి కెల్విన్ అనే వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేసేవాడని.. ఎక్కువగా పెద్ద పెద్ద హోటళ్లు, ఐటీ కంపెనీలు, చిత్ర పరిశ్రమల్లోని వ్యక్తులు సైతం కస్టమర్లుగా ఉన్నారని ఎక్సైజ్ ఎన్ ఫౌర్స్ మెంట్ డైరెక్టరేట్ అకున్ సబర్వాల్ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here