రాజకీయాలకు దూరం..సీఎం యోగి సంచలన ప్రకటన

అరె పీఎం మోడీ వారడిగా ఎవరుంటారు. యూపీ సీఎంగా యోగి ఆదిత్యానాథ్ పదవి బాధ్యతలు చేపట్టినప్పటినుంచి దేశం వ్యాప్తంగా సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. మోడీకి నిజమైన వారసుడు యోగీయే అని బీజే కార్యకర్తలు, ప్రజలు చెబుతూ ఉంటారు. పాలన దక్షతతో తన మార్క్ చూపిస్తున్న యోగీ అవినీతిపరులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో కాబోయే ప్రధానమంత్రి మీరేనంటూ ఆయన దగ్గర ప్రస్తావించగా కొన్ని సంచలన విషయాలు భయటపెట్టారు.  సుదీర్ఘ రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటన చేసి అందర్ని ఆశ్చర్యపరిచాడు.

అనుకున్న పనులన్నీ పూర్తి చేసిన అనంతరం మఠానికి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు.  ప్రధాని మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాల వల్లే  తనకు యూపీ సీఎంగా అదృష్టం అని యోగి వ్యాఖ్యానించారు. అయితే తను ఎన్నేళ్లు యూపీకి ముఖ్యమంత్రిగా ఉండాలని అనుకుంటున్నదీ చెప్పకపోయినా ఆయన అభిమానులు మదనపడుతున్నారట. ఇన్నిరోజులు యూపీకి కొత్త దేవుడు వచ్చాడని సంబరపడిపోయిన ప్రజలు, పార్టీనేతలు సీఎం మాటలతో షాక్ తిన్నారట.

ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే ప్రయత్నంలో ఉన్న యోగీ ఆదిత్యనాథ్ భవిష్యత్తులో ఎటువంటి రాజకీయాలకు శ్రీకారం చుడతారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here