మీ డేటా నెట్వర్క్ స్లో గా ఉందా ? ఇలా చెయ్యండి

త‌క్కువ డేటా, నెమ్మ‌ది నెట్‌వ‌ర్క్‌, త‌క్కువ స్టోరేజీ ఉన్న వినియోగ‌దారుల కోసం ప్ర‌త్యేకంగా గూగుల్ గో పేరుతో ఓ సెర్చింజ‌న్ యాప్‌ను గూగుల్ ఆవిష్క‌రించింది. ప్ర‌స్తుతం ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్ త‌క్కువ డేటాను వినియోగించుకోవ‌డ‌మే కాకుండా సెర్చ్ ఫ‌లితాల‌ను కూడా చాలా వేగంగా అంద‌జేస్తోంది.
ఇంగ్లీష్‌తో పాటు ఇత‌ర దేశీయ భాష‌ల్లోనూ ఈ యాప్ ల‌భ్య‌మ‌వుతోంది. ఎక్కువ ప‌దాల‌ను టైప్ చేయాల్సిన అవ‌స‌రం లేకుండా ట్రెండింగ్ సెర్చ్ ప‌దాల‌ను ఈ యాప్‌లో అందుబాటులో ఉంచారు. కేవ‌లం 5 ఎంబీ ఉన్న ఈ యాప్‌లో గూగుల్ వారి వాయిస్ సెర్చ్‌, ఇమేజ్ సెర్చ్‌, జిఫ్ సెర్చ్‌, యూట్యూబ్‌, వాతావ‌ర‌ణం వంటి అన్ని ఆప్ష‌న్లు ఉన్నాయి. ఇటీవ‌లే డేటా మానిట‌రింగ్ కోసం డేటాల్లీ అనే యాప్‌ను గూగుల్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here