ఇరవైనాలుగు గంటల వ్యవధి లో నాలుగైదు మాటలు మాట్లాడతావ్ ఏంటి చంద్రబాబూ ?

కేంద్రం పూర్తి చేస్తాం అంటే పోలవరం నిర్మాణ బాధ్యతను పూర్తిగా  నమస్కారం పెట్టి అప్ప  చెబుతామని వ్యాఖ్యానించిన చంద్రబాబు. 24 గంటలు గడవకముందే తాను చేసిన వ్యాఖ్యలను మార్చుకున్నారు.. ఈ క్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును ఎలాగైన పూర్తిచేస్తామని అవసరమైతే కేంద్రంతో ముందుకెళ్తామని ప్రకటించారు.. దానికి తగ్గట్టు సంబంధిత మంత్రి గారితోనూచర్చించేందుకు ఢిల్లీ బయలుదేరారు.

చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత దక్షిణ కొరియాకు కూడా బయలుదేరుతారు. అయితే ఢిల్లీ పర్యటనలో ఈ విషయం మీద స్పష్టత వచ్చే అవకాశం ఉండదు  చర్చలు మాత్రం జరుగుతాయి.మరోవైపున వైయస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు ఈనెల 7న పోలవరంకు బస్సు యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పరిణామంలో అక్కడ పనులు పర్యవేక్షించాలని తమ నాయకుడైనా జగన్ ఆదేశించినట్లు పార్టీ నాయకులు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శ కోసం వెళుతున్న వైసీపీని అనుమతిస్తారా లేక మరో వివాదం రగులుతుందా అనేది అనుమానించాల్సిన విషయమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here