జగన్ ఆ నిర్ణయం తీసుకుంటే ఆత్మహత్య చేసుకునట్టే

ఇటీవల టీవీ ఛానల్ కి  ఇంటర్వ్యూ ఇస్తూ మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ పార్టీ గురించి సంచలనమైన నిజాలు బయటపెట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు నిజమో సందేహాలు నెలకొన్నప్పటికీ ఆయన చెబుతున్న విధానం చూస్తే అప్పట్లో జరిగిన రాజకీయ పరిణామం ఆయనకు తెలిసినట్టే ధీమాగా చెబుతున్నారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబుకు కేంద్రంతో కొన్న సత్సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి అనడంలో సందేహం లేదు. దీనికితోడు పోలవరం ప్రాజెక్టు వల్ల రెండు పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు జరిగాయి. అయితే ప్రతిపక్ష నేత జగన్ బిజెపిని విమర్శ చేయకపోవడం చూస్తుంటే బిజెపితో జత కట్టడానికి సిద్ధమవుతున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి.

వీటిపై స్పందించిన ఉండవల్లి బిజెపితో జగన్ పార్టీ జతకడితే రాజకీయంగా జగన్ ఆత్మహత్య చేసుకున్నట్లే అని అన్నారు. ఎందుకంటే జగన్ ఓటు బ్యాంకు అంతా బిజెపిని వ్యతిరేకించే వారు. ఇంకా ఉండవల్లి మాట్లాడుతూ ఒక సంచలనాత్మకమైన విషయాన్ని బయటపెట్టారు అదేంటంటే గడచిన 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు బిజెపి జగన్ పార్టీతో పొత్తు పెట్టుకుందామని ప్రయత్నించిందని అయితే జగన్ తిరస్కరించాడని ఆయన బయట పెట్టారు. జగన్ తిరస్కరించడంతో బిజెపి పార్టీ చంద్రబాబును సంప్రదించిందని తరవాత టీడీపీతో పొత్తు పెట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. వివరించారు మరి ఇది ఎంతవరకు నిజమో ఆ రెండు పార్టీలకు మాత్రమే ఎరుక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here