మందు బాబుల కోసం బీరు పైప్ లైన్లు..పండ‌గే పండ‌గ

పైప్ లైన్ అంటే నీటికోసమో, ఇంధ‌నం కోసం పైప్ లైన్ల‌ను ఏర్పాటు చేస్తారు. కానీ అక్క‌డ మాత్రం మందుబాబుల‌కోసం బీరు పైప్ లైన్ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది విన‌డాకిని ఆశ్చ‌ర్యంగా ఉన్నా..పైప్ లైన్ నుంచి వ‌చ్చే బీరును లాగించేందుకు స్థానికులేకాదు ఇత‌ర ప్రాంతాల‌నుంచి మందుబాబులు తండోప‌తండాలుగా త‌ర‌లివ‌స్తుంటారు. ఎవ‌రికి ఇష్టం వ‌చ్చిన‌ట్లు  తాగి ప‌డిపోవ‌చ్చు.దీనికి ఎలాంటి ఆంక్ష‌లు కూడా ఉండ‌వు. ఈ బీరు పైప్ లైన్ గురించి తెలియ‌ని వారు ఈ త‌తంగం ఎందుకు అని ప్ర‌శ్నిస్తే బీరు తాగ‌డం ఆరోగ్యానికి ఆరోగ్యం కాదు అని చెప్ప‌డ‌మే ఈ పండుగ ప్రదాన ఉద్దేశ‌మ‌ని చెబుతుంటారు.
జ‌ర్మ‌నీ వాకెన్ ప‌ట్ట‌ణంలో ప్ర‌తీసంవ‌త్సరం ఆగ‌స్ట్ నెల‌ల‌లో మూడురోజుల పాటు ఫ్రీ ఎయిర్ ఫెస్టివ‌ల్ జ‌రుగుతుంటుంది. దీన్ని పంటపొల్లాల్లో నిర్వ‌హిస్తుంటారు. ఈ పండ‌గ సెల‌బ్రేష‌న్స్ కోసం వ‌చ్చిన మందుబాబులు పీక‌ల‌దాకా మ‌ద్యం సేవించి పంట‌ను నాశనం చేస్తున్నారు. దీనిపై న‌ష్ట‌నివార‌ణ‌చేప‌ట్టిన పండ‌గ ఉత్స‌వ క‌మిటీ నిర్వాహ‌కులు ..బీర్ల‌ను సీసాల్లో కాకుండా పైప్ లైన్ నుంచి తాగే విధంగా ఏర్పాటు చేశారు. అక్క‌డికి వ‌చ్చిన అతిధులు ట్యాప్ తిప్పి మంచినీళ్లును ఎలా తాగుతామో..బీర్ల‌ను కూడా అలా పైప్ లైన్ నుంచి తాగి ఎంజాయ్ చేయాలి.

లేదంటే పండ‌గ నుంచి బ‌హిష్క‌రిస్తారు. అయితే ఈ పైప్ లైన్ బీరు పై కొంత‌మంది పెద‌వి విరిచినా ..మ‌రికొంత‌మంది మ‌ద్ద‌తు ప‌లికారు. తామెప్పుడు సీసాల్లో తాగ‌డం వ‌ల్ల బోర్ కొట్టింది. పైప్ లైన్ నుంచి బీర్ తాగడం మంచి కిక్కు ఇస్తుంద‌ని ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here