రజినీకాంత్ మీద ఆ డైరెక్టర్ బూతు కామెంట్ లు

తమిళ నాట రజినీకాంత్ పొలిటికల్ అరంగేట్రం గురించి అనేక చర్చలు సాగుతున్నాయి. ప్రముఖ డైరెక్టర్ భారతీ రాజా ఈ విషయం లో చేసిన బూతు విమర్శలు గట్టిగా వివాదాస్పదం అయ్యాయి. చెన్నై ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన రజినీకాంత్ రాజకీయాలలోకి రావడానికి తాను ఒప్పుకోను అనీ, దానికి తాను వ్యతిరేకం అనీ చెప్పారు. ” ఎవరో మా మీద పెత్తనం చేలాయించాలి అని చూస్తే మాత్రం ఊరుకోము.

తమిళులు కాని వారు మా మీద పడి మమ్మల్ని దోచుకోవడం మేము ఒప్పుకోము. తమిళుల కంటే మంచి నేతలు లేరా ? ” అన్నారు భారతీ రాజా. వారు అలా అనడం ఎలా ఉందంటే… భార్య గర్భవతి కాలేదని బాధపడుతున్న వాడితో నీ బిడ్డకు తండ్రిగా ఉంటానని అడగుతున్నట్టు ఉందని ఆయన మండిపడ్డారు. ” అన్నిట్లో భాగం ఇస్తాం పడకలో కూడా భాగం అడుగుతారా ? ” అని సంచలన కామెంట్ లు చేసారు ఆయన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here