కుంబ్లే చేసిన ఆ పని వల్లే కోచ్ పదవి పోయేలా ఉంది ?

టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీల మధ్య గ్యాప్ పెరగిన నేపథ్యంలో… రోజుకొక కొత్త వివాదం తెర మీదకు వస్తోంది. తాజాగా జట్టుకు సంబంధించిన సమాచారాన్ని మీడియాలో ఉన్న తన మిత్రులకు కుంబ్లే లీక్ చేస్తున్నాడంటూ కొత్త రూమర్ హల్ చల్ చేస్తోంది. దీనికి సంబంధించి డీఎన్ఏ వార్తాపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
మీడియాలో ఉన్నటువంటి తన మిత్రులతో కూడిన ఓ వాట్సాప్ గ్రూప్ ను కుంబ్లే ఏర్పాటు చేశాడని… దీని ద్వారా జట్టుకు సంబంధించిన సమాచారాన్ని వారికి ఎప్పటికప్పుడు లీక్ చేస్తున్నాడని సదరు పత్రిక తెలిపింది. అంతేకాదు ఆటగాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పటి సమాచారాన్ని కూడా వాట్సాప్ లో పంపుతున్నాడని పేర్కొంది.
ఈ నేపథ్యంలో కుంబ్లే, కోహ్లీల మధ్య అగాధం మరింత పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కోచ్ గా కుంబ్లే పదవీకాలం ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ముగియనుంది. ఈ నేపథ్యంలో, కోచ్ పదవి కోసం బీసీసీఐ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ కొత్త కోచ్ ను ఎంపిక చేయనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here