కళ్యాణ్ రామ్ ఆ అమ్మాయితో ఎందుకు రిస్క్ చేస్తున్నాడు

కాస్తంత గ్యాప్ ఇచ్చిన తరవాత నందమూరి కళ్యాణ్ రామ్ మేకప్ వేసుకోవడానికి సిద్దం అయ్యాడు. ఎం ఎల్ ఏ అనే సినిమాతో రాబోతున్న కళ్యాణ్ రామ్ కొత్త డైరెక్టర్ ఉపేంద్ర మాధవ్ డైరెక్షన్ లో కనిపిస్తాడు. అమెరికా పర్యటన నుంచి వచ్చిన కళ్యాణ్ ఈ మాట మీడియా లో కూడా చెప్పాడు. ఈ చిత్రానికి కథానాయక కూడా ఖరారైందన్నది తాజా సమాచారం.

ఈ వారమే విడుదల కానున్న ‘ఫ్యాషన్ డిజైనర్’లో ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా నటించిన మనాలి రాథోడ్ కళ్యాణ్ రామ్‌తో జత కట్టనున్నట్లు తెలుస్తోంది. అంత చిన్న హీరోయిన్ కి కళ్యాణ్ రామ్ చాన్స్ ఇవ్వడం ఎందుకు అంటున్నారు చాలా మంది. ఆమె చేసినవి అన్నీ చాలా చిన్న సినిమాలు. చెప్పుకోదగ్గ సినిమా అంటే ఫాషన్ డిజైనర్ ఒక్కటే అందులో కూడా ముగ్గురు హీరోయిన్ లలో ఒకరు. ‘గ్రీన్ సిగ్నల్’ అని.. ‘ఓ స్త్రీ రేపురా’ అని ఊరూ పేరు లేని సినిమాల్లో నటించింది మనాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here