గంగూలీ vs రవి శాస్త్రి .. ఏం జరుగుతోంది అసలు ?

టీం ఇండియా మాజీ ఆటగాళ్ళు ప్రస్తుతం కామెంటేటర్ లు అయిన రవి శాస్త్రి , గంగూలీ ల మధ్యన ఐపీఎల్ సాక్షిగా విభేదాలు మళ్ళీ భగ్గు మన్నాయి. జట్టుకి కోచ్ ని తీసుకునే క్రమం లో గంగూలీ అధినేత్రుత్వం లో ఉన్న కమిటీ రవి ని తీసుకోకుండా కుంబ్లే ని తీసుకోవడం రవి కి నచ్చక అప్పట్లో గొడవ జరిగింది. రవిశాస్త్రి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా, గంగూలీ సైతం దీటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇక బుధవారం జరిగిన ఐపీఎల్ పోటీల్లో దిగ్గజ క్రికెటర్లయిన సచిన్, గంగూలీ, సెహ్వాగ్, లక్ష్మణ్ లకు సన్మానం జరిగింది.

ఈ కార్యక్రమం లో వ్యాఖ్యాత గా వచ్చిన రవి శాస్త్రి అందరి గురించి చెప్తుంటే గంగూలీ సైలెంట్ గా నేల చూపులు చూసాడు. రవి శాస్త్రి తో గంగూలీ ఫార్మాలిటీ కి కూడా మాట కలపలేదు. ఇద్దరూ ఎడమొహం పెడ మొహం పెట్టుకుని కనిపించారు. ఇది క్రికెట్ అభిమానుల మధ్య పెద్ద చర్చ కి దారి తీసింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here