మహేష్ ని ఏడిపించారు .. మ్యూజిక్ డైరెక్టర్ బాధ పడ్డాడు

బ్రహ్మోత్సవం సినిమా టైం లో జరిగిన సంఘటన లు మహేష్ ఫాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ సినిమా రావడానికి సరిగ్గా నెల రోజుల ముందర వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కి సంబంధించి ప్లాప్ ని పట్టుకుని మహేష్ ఫాన్స్ కామెంట్ లు చెయ్యగా నెల తరవాత వచ్చిన బ్రహ్మోత్సవం కి ఫ్లాపోత్సవం అంటూ రెచ్చిపోయారు పవన్ ఫాన్స్. డిజాస్టర్ మహేష్ బాబు అంటూ ట్రెండ్ కూడా చేసారు. యాంటీ ఫాన్స్ ట్రాలింగ్ హద్దులు దాటిన క్షణం అంటే అదే. ఈ ట్రాలింగ్ టైం లో మహేష్ బాబు నుంచి పెద్ద రియాక్షన్ లేదు.

ఎప్పటి లాగానే సైలెంట్ గా తన కొత్త సినిమా పనుల్లో బిజీ అయ్యాడు మహేష్ బాబు. కానీ బ్రహ్మోత్సవం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ మాత్రం తెగ బాధ పడ్డాడట. ఈ మధ్యన జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయం చెప్పాడు మిక్కీ. శ్రీకాంత్ అడ్డాల ఒక మంచి సినిమా ఇవ్వాలని చూడగా ప్లాప్ అవ్వడం తో అప్పటికే నిరాశ చెంది ఉన్న టీం ని టార్గెట్ చేసారు యాంటీ లు దానికి తాను చాలా బాధపడ్డం అన్నాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here