బాలయ్య – డాన్ పాత్రలో సెట్ అవ్వడం లేదు?

శాతకర్ణి సార్వభౌముడి గా తన వందవ సినిమాలో కనిపించిన బాలకృష్ణ దానికి సంబంధించిన చారిత్ర ఆధారాలు లేకపోయినా శాతకర్ణి గా కనపడ్డం కోసం వింత లుక్ లో కనిపించారు. జుట్టు మీసం రెండూ పెంచి ఈ సినిమాలో పెద్ద రాజుగా సెట్ అయిన బాలయ్య ఆ సినిమా విడుదల అయిన కొన్ని రోజుల వరకూ అలాగే కనపడ్డారు. ఈ మధ్యన పూరీ జగన్నాథ్ తో సినిమాకి సిద్దం అయిన బాలయ్య మొదటి షెడ్యూల్ ని పూర్తి కూడా చేసినా ఆయన లుక్ అలాగే ఉంది.
మొదటి షెడ్యూల్ తరవాత కూడా డాన్ సినిమాలో డాన్ లుక్ తో కనపడ్డం లేదు ఆయన. ఆ సినిమాలో డాన్ పాత్ర కోసం కొత్త అవతారం ఎత్తి ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ పాత లుక్ లోనే బాలయ్య దర్సనం ఇస్తున్నారు. మీసాన్ని కాస్త తగ్గించినా మిగితా అంతా శాతకర్ణి స్టైల్ లో ఉన్నారు తప్ప , డాన్ లాగా కనపడడమే లేదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here