చచ్చిన పామును చంపుతున్న బీజేపీ…కమలం తీర్ధం పుచ్చుకోనున్న రేవంత్ రెడ్డి

వచ్చేఎన్నికల కోసం ఇప్పటినుంచి రాజకీయ పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి. ఎన్నికల్లో గెలుపుకోసం చావో రేవు తేల్చుకోనున్నాయి. అందుకే చచ్చిన పామును మరింత చంపేందుకు తెలంగాణ కు చెందిన పార్టీలు సిద్ధమయ్యాయి. ఆ చచ్చిన పాము ఏంటిది..? ఎవరు చంపుతున్నారు..? తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ చచ్చిన పాముతో సమానం అని పలుమార్లు సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిందే. అయితే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ పావులు కదుపుతుంది.
ఈ నేపథ్యంలో పార్టీ కేడర్ లేక, ఉన్ననేతల్ని కాపాడుకోలేక సతమతమవుతున్న టీటీడీపీ ని బీజేపీ మరో ఉపధృవం రూపంలో ముంచెత్తనుంది. 2019 ఎన్నికల్లో ఎలాగైన గెలవాలనే తపనతో కమలం కసరత్తులు చేస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ జేఏసీ ఛైర్మన్ తో సంప్రదింపులు జరిపింది. ఎన్నికల ప్రణాళికతో  టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని మంతనాలు జరుపుతోంది.
మరోవైపు కేబినేట్ మార్పులతో  అధికార పార్టీనేతల్లో అసమ్మతి స్వరం, ఏపీలో ప్రతిపక్ష పార్టీ ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంటే కరవమంటే కప్పకు కోసం విడవమంటే పాముకు కోపం అన్న రీతిలో తయారైంది టీడీపీ పరిస్థితి. ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీలో చేరితే టీటీడీపీ పరిస్థితి అగమ్య గోచరమేనని పొలిటికల్ క్రిట్సిక్స్ అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here