ఈ ముస‌లోడు త‌క్కువోడేం కాదు

విద్యార్ధిని పై హ‌త్యాచార కేసులో అరెస్టైన ప‌ల‌హారి బాబా రాస‌లీలు ఒక్కోటిగా వెలుగులోకి వ‌స్తున్నాయి.
ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన 21ఏళ్ల లా విద్యార్థి బాబాపై ఫిర్యాదు చేయడంతో  పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. విచార‌ణ‌లో భాగంగా ఫ‌ల‌హారి బాబ అరాచ‌కాల్ని బాధితురాలు ఎఫ్ ఐ ఆర్ లో పొందుప‌రిచింది. భ‌క్తి ముసుగులో త‌న‌వ‌ద్ద‌కు వ‌చ్చే యువ‌తుల‌కు మాయామాట‌లు చెప్పేవాడ‌ని అలా త‌న నాలుక‌ను నాకితే దైవానుగ్ర‌హం పొంది మీరు ఏది అనుకుంటే అది సాధిస్తార‌ని న‌మ్మ‌బ‌లికేవాడు.
త‌న నాలుక‌పై తేన‌తో ఓం అనే బీజాక్ష‌రం రాసి నాక‌మ‌న్నాడ‌ని … నువ్వు అలా నాకితే నాలోని జ్ఞానం నీకు ప్రసారమవుతుంది. చాలామందికి ఇదే రీతిలో జ్ఞానాన్ని ప్రసాదించాను.. నువ్వు కూడా పొందు’ అంటూ శృంగార బాబా  తనతో చెప్పినట్లు అత్యాచార బాధితురాలు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
అంతేకాదు తాను బాబాను క‌లిసేందుకు ఓ గ‌దిలోకి  వెళ్ల‌గా త‌లుపులేసి అత్యాచారం చేశాడ‌ని, దేవుడు చెప్పాడు కాబ‌ట్టే ఇలా చేసిన‌ట్లు బాబా త‌నతో అన్నాడ‌ని  ఆవేదన వ్యక్తం చేసింది.
ఇలా చేసిన వారిలో ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలు కూడా ఉన్నార‌ని , నిన్ను ఏకంగా జడ్జినే చేస్తానని బాబా తనతో చెప్పినట్లు బాధితురాలు తెలియజేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here