హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో…ప‌వ‌న్ స్పీచ్‌…

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ కు అంతర్జాతీయ యవనికపై మరో పురస్కారం అందనుంది. గత ఫిబ్రవరి లో అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ పవన్‌ కళ్యాణ్ గారిని గౌరవించగా ఇప్పుడు పవస్ కళ్యాణ్ రాక కోసం బ్రిటన్‌లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ ఎదురుచూస్తోంది. ప్రతిష్టాత్మకమైన ఇండో యురోపియన్‌ బిజినెస్ ఫోరమ్ (ఐ.ఇ.బి.ఎఫ్.) వివిధ రంగాలలో లబ్దప్రతిష్టులైన వారికి ఏటా గ్లోబల్ బిజినెస్ మీట్ సందర్భంగా ఎక్సెలెన్స్ అవార్డు ఇచ్చి గౌరవిస్తోంది. ఈసారి ఈ అవార్డుతో పవన్‌ కళ్యాణ్ గారిని సత్కరించాలని నిర్ణయించుకుంది. కోట్లాదిమంది అభిమానాన్ని చూరగొన్న నటునిగా, సమున్నతమైన ఆశయాలున్న రాజకీయ నాయకునిగా, గొప్ప మానవతావాది అయిన పవన్‌ కళ్యాణ్ ను గెస్ట్ అఫ్ హానర్ గా ఆహ్వానిస్తూ ఈ ఏడాది జరగనున్న సమావేశంలో ఐఈబీఎఫ్ ఎక్సెలెన్స్ అవార్డును అందుకోవలసిందిగా ఐఈబీఎఫ్ ఇండియా విభాగం లీడర్ సునీల్ కుమార్ గుప్తా, కోఆర్డినేటర్ చంద్ర శేఖర్ కోరారు.
ఈ మేర‌కు హైద‌రాబాద్‌లో ప‌వన్‌ కళ్యాణ్‌ను కలిసిన గుప్త, చంద్ర శేఖర్ తమ ఆహ్వానాన్ని అందించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలోని వేలాదిమంది కిడ్నీ వ్యాధి పీడితులను ఆదుకోవడంలో చూపిన మానవత్వం, చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచి నేత కళాకారులకు వెన్ను దన్నుగా నిలచిన తీరు, సామాజిక సమస్యల పరిష్కారంలో 3. కళ్యాణ్ గారు చూపుతున్న చొరవ, సుసంపన్నమైన సమాజ స్థాపన కోసం ఆయన చేస్తున్న కృషి ఎన్నో హృదయాలను హత్తుకున్న‌ట్లు వారు కొనియాడారు. ఈ అవార్డును నవంబర్ 17 న లండన్‌లోని బ్రిటస్ పార్లమెంట్ గా పిలిచే హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో జరగనున్న ఇన్వెస్ట్ ఇన్‌ న్యూ ఇండియా సభలో అందించనున్నారు. పవన్‌ కళ్యాణ్ ఈ సదస్సులో పాల్గొంటే భారతదేశానికి పెట్టుబడులు మరిన్ని తరలివస్తాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అవార్డు స్వీకారం ప‌ట్ల‌ పవస్ కళ్యాణ్ గారు తన అంగీకారాన్ని సూత్రప్రాయంగా తెలిపారు. ఈ సదస్సు ఇటు భారతీయలు, అటు యూరప్ వాసులకు వాణిజ్య అవసరాలను మరింత విస్తృత పరుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
కాగా, ఇన్వెస్ట్ ఇన్‌ న్యూ ఇండియా సభలో జీపీ హిందుజా, వేదాంత చైర్మన్‌ అనిల్ అగర్వాల్, ఎస్.పి.లోహియాతో పాటు మరికొందరు ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్య వేత్తలు, రాజకీయ నేతలు, ఇతర రంగాల ప్రముఖులు పాల్గొననున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here