తెలంగాణా ప్రభుత్వాని లెక్క చెయ్యని “పేస్ బుక్” సంస్థ

తెలంగాణ పోలీసుల కు పేస్ బుక్ సంస్థకు మధ్య కోల్డ్ వార్ మొదలయ్యింది.ఇటీవలతెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ పోస్టింగ్ పెట్టడం జరిగింది.అయితే ఈ క్రమంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పోస్టింగ్ పెట్టినవారిని కనుగొనేందుకు వారి ఏ ఐపీ అడ్రసుల నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు  పేస్ బుక్ సంస్థ ను కలవడం జరిగింది.

ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులు  ‘ఫేస్ బుక్’ నిర్వాహకులను ఐపీ అడ్రసుల వివరాలను తమకు తెలపమని కోరడంతో అటువంటి వివరాలు వెల్లడించమని ‘ఫేస్ బుక్’ తేల్చి చెప్పింది… తెలంగాణ పోలీసులు ఇది సాధారణ కేసు కాదు  ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు అని  ‘ఫేస్ బుక్’ నిర్వాహకులకు తెలియపరిచారు అయినా సరే ‘ఫేస్ బుక్’ సంస్థవెనక్కి తగ్గకపోవడంతో..తెలంగాణ పోలీసులు ఏమీ చేయలేక కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. సీఐడీ ద్వారా ఎంహెచ్ ఏకు ఓ లేఖ రాశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here