పవన్ కళ్యాణ్ మంచి గురించి ఆలోచిస్తున్నా – కత్తి మహేష్

భారీ అంచనాల మధ్య విడుదలైన అజ్ఞాతవాసి సినిమా ప్రేక్షకులను అభిమానులను ఎంతో నిరాశపరిచింది మొదటిరోజే ఫ్లాప్  టాక్ రావడంతో సినిమా కి వెళ్లడానికి ప్రేక్షకులు భయపడుతున్నారు. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ గత చిత్రాలకు భిన్నంగా అజ్ఞాతవాసి సినిమా ఉందని అంటున్నారు.సినిమాలో త్రివిక్రమ్ మార్కు కనపడలేదని చెప్పుకొచ్చారు సినిమా చూసినా ప్రేక్షకుడు. అయితే ఈ సందర్భంగా సినిమా చూసిన ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ అజ్ఞాతవాసి సినిమాకి సంబంధించి ట్వీట్ చేశారు.

సీరియస్ కధకు కామెడీ జోడించి చికాకు పెట్టించి అపహాస్యం చేశారని ఆయన ట్వీట్ సారాంశం.కత్తి మహేష్ తాజాగా సోషల్ మీడియా చానల్ కు  ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదట్లో అజ్ఞాతవాసి టీజర్ చూసి సినిమాలో ఏమీ లేదని, తర్వాత వచ్చిన ట్రైలర్ చూస్తే సినిమా చూడాలని అనిపించిందని కత్తి మహేష్ అన్నారు.తీరా సినిమా చూశాక అజ్ఞాతవాసి తీవ్రంగా నిరాశపరిచిందని కత్తి మహేష్ అన్నారు.

సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.మంచి కధ కు సరైన న్యాయం చేయకపోగా దాని తాలూకు ఫీల్ ని నాశనం చేస్తే ఎవరూ ప్రశంసించారని అన్నారు .చివరిగా పవన్ పూర్తి స్థాయి రాజకీయాల లోకి వెళ్లే ముందు ఒక మంచి సినిమా చేయాలని తాను కోరుకుంటున్నట్లు కత్తి మహేష్ చెప్పారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here