కెసిఆర్ – పవన్ కళ్యాణ్ ల మధ్య లింక్ బయట పెట్టాడు

గత ఎన్నికలప్పుడు ఎవరో పవన్ కల్యాణ్ అట అని వ్యాఖ్యానించిన కెసిఆర్ ఇప్పుడు  అదే వ్యక్తితో రాసుకుని పూసుకుని ఉంటున్నారు అని , ఈమధ్య జరిగిన ఇద్దరి భేటీ ద్వారా అర్థమయ్యిందని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తెలిపారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన పవన్కళ్యాణ్ తో  కెసిఆర్ ఎలా వ్యవహరిస్తారో నాకు ముందే తెలుసు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు మంచి క్రేజ్ ఉన్న నాయకుడు అలాగే కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి కెసిఆర్ పవన్ కళ్యాణ్ తో సానుకూలంగా ఉంటూ రాబోయే ఎన్నికలలో వాడుకోవడానికి కెసిఆర్ గాలం  వేస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఎందుకంటే తెలంగాణలో కూడా కాపులు ఉన్నారు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో మంచిగా ఉంటే వారి ఓట్లు టీఆర్ఎస్‌కి ప‌డ‌తాయ‌ని ఉద్దేశంతో కెసిఆర్ వున్నారు అని వీహెచ్‌ అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కే ప‌రిమితం అవుతారా? తెలంగాణ‌లోనూ టీఆర్ఎస్ పార్టీని విమ‌ర్శిస్తారా? అన్న అనుమానం కేసీఆర్‌కి ఉండొచ్చని, అందుకే ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో మంచిగా ఉండాల‌ని కేసీఆర్‌ చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here