నాగార్జున ఏంటి గాలికి వదిలేసాడు

హీరోగా నాగార్జున స్పీడు తగ్గించిన నిర్మాతగా బిజీగానే ఉంటున్నారు.కాగా ఇటీవల తన కొడుకు అఖిల్ హీరోగా హలో సినిమాని తెరకెక్కించడం జరిగింది..సరైన హిట్టులేక కొట్టుమిట్టులాడుతున్న అఖిల్ కు మంచి  హిట్టవ్వాలని ఉద్దేశ్యంతో నాగార్జున భారీ బడ్జెట్తో హలో సినిమాను తీయడం జరిగింది. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా భయంకరంగా జరిపారు ప్రమోషన్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ,రామ్ చరణ్   రావడం జరిగింది ..అయినా సినిమా విషయానికి వచ్చేసరికి పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది బడ్జెట్ లో సగం కూడా రాబట్టలేకపోయింది .

ఎంతో కష్ట పడ్డా నాగార్జునకు ఈ సినిమా గట్టి దెబ్బ వేసింది.అయితే ప్రస్తుతం నాగార్జున రాజ్ తరుణ్   హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద లోబడ్జెట్లో రంగులరాట్నం అనే సినిమా తీశారు అనుకోకుండా రంగులరాట్నం సినిమా సంక్రాంతి బరిలోకి రావడంతో ఎటువంటి అంచనాలు లేని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా అంతగా ఏమీ కనపడటంలేదు.అసలు నిర్మాత నాగార్జున రంగులరాట్నం  ప్రమోషన్స్ విషయమై  ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. హలో  సినిమాకి చూపిన శ్రద్ధ రంగుల రత్నం సినిమా మీద చూపలేకపోతున్నారు నాగార్జున.

ఎంత లో బడ్జెట్ సినిమా అయినా ప్రమోట్  చేయకుండా గాలికొదిలేయడం సమంజసంగా లేదు.కేవలం రాజ్ తరుణ్,డైరెక్టర్,హీరోయిన్ చిత్ర శుక్ల మాత్రమే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.అయితే నాగార్జున మాత్రం మీడియా ముందుకు రావడానికి కూడా ఆలోచిస్తున్నారు..కారణమేంటంటే హలో సినిమా డిజాస్టర్ అని చాలామంది అంటున్నారు. హలో సినిమా కొన్ని చాలామంది డిస్ట్రిబ్యూటర్లు చేతులు కాల్చుకున్నారు అందుకనే రంగులరాట్నం  రైట్స్ కూడా హలో  డిస్ట్రిబ్యూటర్స్ కు ఇచ్చేసాడట నాగార్జున.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here