జీన్స్ కు చిన్న‌జేబు ఎందుకు ఉంటుందో తెలుసా..ఈ జేబుకు 140 సం.ల చ‌రిత్ర ఉంది

వ‌యోబేదంలేకుండా జీన్స్ ను ధ‌రిస్తారు. అందుకే జీన్స్ కు అంత క్రేజ్ వ‌చ్చింది. బ్రిటీష్ కాలంలో జీన్స్ ను కాళ్లు తుడుచుకోవ‌డానికి, ప్ర‌మాదాల్ని అరిక‌ట్ట‌డానికి ఉప‌యోగించేవారు. వీటికోసం ర‌క‌ర‌కాల రంగుల జీన్స్ ముక్క‌ల‌ను త‌యారు చేశారు. ఆ జీన్స్ రాను రాను ఫ్యాష‌న్ గా తాయారైంది. రకరకాల మోడల్స్ క్రేజీ కలర్స్ లో దొరికే జీన్స్ లో ఒక సీక్రెట్ దాగి ఉంది.చాలా మందికి ఈ సీక్రెట్ గురించి తెలిసి ఉండకపోవచ్చు. జీన్స్ వేసుకునే వాళ్ల ప్యాంట్లకు ముందు రెండు పాకెట్స్, వెనుకు రెండు పాకెట్స్ కామన్. కానీ ఫ్రంట్ రైట్ సైడ్ పాకెట్ లో ఇంకో చిన్న పాకెట్ ఉండటం నోటీస్ చేసే ఉంటారు. దీన్ని చాలా మంది ఫ్యాష‌న్ అనుకుంటారు. కానీ దానికి ఓ చ‌రిత్ర ఉంది. మొద‌ట ఈ చిన్న జేబుల్ని 1880ల‌లో కౌబాయ్స్ వాచీలు వాడే వార‌ని , వాటిని భ‌ద్రంగా ఉంచేందుకు జీన్స్ కు చిన్న జేబుల్ని ఏర్పాటు చేశార‌ని చెప్పకుంటారు. కానీ అందులో నిజంలేదు.

జీన్స్ కు ఉన్న జేబుకు 140సంవ‌త్సరాల చ‌రిత్ర ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఏదైనా ఓ ర‌హ‌స్యాన్ని దాచిపెట్టాల‌న్నా, ఆదే ర‌హ‌స్యాన్ని మ‌రొక‌రికి చేరవేయాల‌న్న ఏం చేయాలి. అప్ప‌ట్లో చేసే ప‌నుల వ‌ల్ల బ‌ట్ట‌ల‌న్నీ చిరిగిపోయి జేబుల్లో ఉన్న ర‌హ‌స్యాల‌న్నీ పాడై పోయేవి.దీనికి విరుగు క‌నిపెట్టిన జాబ‌క్ దావిస్ 1872లో దీన్ని వెలుగులోకి తెచ్చాడు. అంతేకాదు ఇందులో త‌గినంత డ‌బ్బుల్ని దాచుకోవ‌డానికి ఫ్యాబ్రిక్ స‌ప్లైయ‌ర్ లేవి కొన్ని స‌ల‌హాలు సూచ‌న‌లు ఇచ్చాడు. దీంతో జీన్స్ కు చిన్న జేబు పెట్టే స‌దుపాయం ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చింది. లేవి పేరుమీద ఇప్ప‌టికీ జీన్స్ త‌యారు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here