కొనఊపిరితో రావణుడు లక్ష్మణుడికి ఏం చెప్పాడో తెలుసా?

రామాయణం ముగిసేది రావణాసురుడి సంహారంతోనే అని అందరికి తెలిసిందే. అయితే రావణాసురుడు కొనుఊపిరితో ఉన్నప్పుడు రాముడు లక్ష్మణుడిని ఇలా పిలిచి  బ్రాహ్మణ పండితుల్లో ఒకరైన రావణాసురిడి దగ్గరకు వెళ్లి నాలుగు మంచి విషయాలు తెలుసుకోమని చెబుతాడు. అన్నమాటను శిరసా వహించే లక్ష్మణుడు రావణుడి దగ్గరికి వెళతాడు.
ఆ సందర్భంగా రావణాసురుడి లక్ష్మణుడికి కొన్ని విషయాలు చెబుతాడు. అవి పాటిస్తే జీవితంలో విజయం సాధించవచ్చని తెలుస్తుంది.  మన రధసారధితో , కాపలా వాడితో, వంటవాడితో నీ తమ్ముడితో ఎప్పుడూ స్నేహంగా మెలగాలి. వారితో శత్రుత్వం పెట్టుకుంటే ఎటునుంచైనా మనకు హాని చేస్తారు. ఒక్కోసమయంలో వారు మన ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. నిన్ను ఎప్పుడూ విమర్శించే వారిని నమ్మవచ్చు కానీ, నిన్ను పొగిడే వారిని ఎప్పుడూ నమ్మవద్దు. ఎప్పుడూ విజయం నిన్నే వరిస్తుందని అనుకోకు . నీ శత్రువు చిన్నవాడని తక్కు వ అంచనా వేయకు. ఎవరి వెనుక ఎంత బలం ఉందో ఎవరికి తెలుసు. నేను హనుమంతుడిని తక్కువ అంచనా వేసి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను. రాజుకు యుద్ధంలో గెలవాలన్న కోరిక ఉండవచ్చు. కానీ ఎప్పుడూ అత్యాస ఉండకూడదు. దేవుణ్ని ప్రేమించవచ్చు, కోపగించుకోవచ్చు. ఎలా ఉన్నా నువ్వు దృఢ నిశ్చయంతో ఉండాలి. ఇలా మాటలను లక్ష్మణుడికి చెబతూ రావణుడు ప్రాణాలొదిలాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here