దేవుడి ఉంగరాన్ని ధరించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బంగారం…!ముఖ్యంగా ఆడవాళ్లకు బంగారంపై ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బంగారం ధరిస్తున్నా కష్టాలనుంచి భయటపడేందుకే ఆడవాళ్లు బంగారం మక్కువ చూపుతారనే నానుడి ఉంది. కుటుంబంలో ఎవరైనా ఆర్ధికంగా ఇబ్బంది పడుతుంటే తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మి ఆ ఇబ్బందులు తొలగిస్తారని చెబుతుంటారు. అయితే ఇలా ధరించే బంగారంలో దేవుడి ప్రతిమలు ఉన్న ఉంగరాలపై కొన్ని ఆంక్షలు ఉన్నాయి. వాటిని తప్పకుండా పాటించాలని హిందూ సాంప్రదాయంలో ఉంది.
దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాల్ని ధరించడం వల్ల ఉదయాన్ని దైవదర్శనం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని నమ్ముతుంటాం.  1.  దేవుడి ఉంగరాలు ఎదైనా పూజలు చేసిన తరువాతే ధరించాలి. అలా చేస్తే దైవానుగ్రహం పొందవచ్చు.
2 . ఉంగరంలోని దేవుడి ప్రతిమ శిరస్సు మణికట్టు వైపున, కాళ్ళు చేతి గోళ్ల వైపున ఉండాలి.
3. ఉంగరాన్ని కళ్లకు అద్దుకునేటప్పుడు చేతి వేళ్లని మూసి ఉంచి కళ్లకు అద్దుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లో చేతివేళ్లు మూయకుండా దేవుణ్ని స్మరించుకోకూడదు.
4. పీరియడ్స్ సమయంలో స్త్రీలో ఉంగరాన్ని ధరించకూడదు.
5 . భోజనం చేసేటప్పుడు చేతికి ఉంగరాల్ని ఉంచకూడదు. మనం తిన్నఎంగిలి అంటుతుంది కాబట్టి.
 ఇలా చేస్తే మంచిదని లేకుండా  లేకపోతే మంచి కంటే చెడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉందని పండితులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here