దీపావళికి కాదు.. రిపబ్లిక్ డేకు వస్తాడట

శంకర్ సినిమాలకు ఓ సెంటిమెంట్ ఉంది. భారీ తనంతో నిర్మించే ఆయన సినిమాలు.. దాదాపుగా చెప్పిన డేట్ కు ఎన్నడూ విడుదల కాలేదు. ఇప్పుడు రజనీకాంత్ హీరోగా.. రోబోకు సీక్వెల్ గా వస్తున్న.. 2.0 సినిమాకూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. దీపావళికి సినిమాను విడుదల చేస్తామని చెప్పిన యూనిట్.. ఇప్పుడు నిర్ణయాన్ని మార్చుకుంది.

జనవరి 25న 2.0 సినిమాను విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది.అది కూడా.. సంక్రాంతి బరిలో వేరే సినిమాలు ఉంటాయి కాబట్టి.. రిపబ్లిక్ డే నాటికి ఆ హడావుడి తగ్గుతుంది కాబట్టి.. భారీ స్థాయిలో.. వీలైనన్ని థియేటర్లలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

వీఎఫ్ఎక్స్ పనుల కారణంగానే.. సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ట్విటర్ లో తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here