మహేష్ పాలిట విలన్ అవుతున్న నాని

వంద కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో.. మురుగదాస్ డైరెక్షన్ లో.. మహేష్ బాబు చేస్తున్న స్పైడర్ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. జూన్ 23న ఈ సినిమా రిలీజ్ చేస్తామని యూనిట్ ప్రకటించింది. ఇప్పుడు అదే డేట్ కు.. నేచురల్ స్టార్ నాని కూడా థియేటర్లలో సందడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. వరుస విజయాలతో ఊపుమీదున్న నాని.. ఇప్పుడు నిన్ను కోరి.. అనే క్లాసీ టైటిల్ తో కొత్త సినిమాను సూపర్ ఫాస్ట్ గా కానిచ్చేస్తున్నాడు.

ఆ సినిమాను జూన్ 23నే విడుదల చేయాలని సినిమా యూనిట్ నిర్ణయించింది. ఈ విషయంలో వెనక్కి వెళ్లే అవకాశం లేదని కూడా తెలుస్తోంది. ఎందుకంటే.. చూడ్డానికి సాఫ్ట్ గానే కనిపించే నాని.. తన సినిమాల విషయంలో పక్కా ప్లాన్ గా అడుగులు వేస్తున్నాడు. సినిమాను ఓ టైమ్ కు రిలీజ్ చేయాలి అనుకుంటే.. అదే టైమ్ కు థియేటర్లలో విడుదల చేసేస్తున్నాడు.

ఇప్పుడు మహేష్ బాబు సంగతి చూస్తే.. స్పైడర్ సినిమా మహేష్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. సినిమా ఫస్ట్ లుక్ విషయంలో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవడంతో.. చాలా జాగ్రత్తగా.. ఎంత ఆలస్యమైనా పర్వాలేదన్న పట్టుదలతో.. పక్కాగా స్పైడర్ ను మహేష్ ముస్తాబు చేయిస్తున్నాడు. ఇంతలో.. నాని సినిమా కూడా అతనికి పోటీగా వస్తోందని తెలిసి.. మహేష్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నాడు.

ఇప్పటికే.. బ్రహ్మోత్సవం లాంటి భారీ డిజాస్టర్ ను ఇచ్చిన మహేష్ సినిమాకు.. వరుస విజయాల్లో ఉన్న నాని సినిమా ఎదురొస్తోందంటే.. ఆ మాత్రం టెన్షన్ తప్పదని ఓపెన్ గా ఒప్పేసుకుంటున్నారు. స్పైడర్ ఏ మాత్రం మిస్ ఫైర్ అయినా.. నిన్ను కోరి.. ఓ రేంజ్ లో హిట్ అయ్యే అవకాశాలుంటాయని అభిప్రాయపడుతున్నారు. దీంతో.. ఇప్పుడు సినిమాల్లో ఫేస్ టు ఫేస్ కాకున్నా.. రిలీజ్ విషయంలో మాత్రం.. మహేష్ కు నాని విలన్ గా మారుతున్నాడు. చూద్దాం.. ఏం జరుగుతుందో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here