మహేష్ బాబు శ్రీకృష్ణుడు అవ్వాలి అంటే నమ్రత పర్మిషన్ కావాలి

వారం రోజులలో రాబోతున్న బాహుబలి కి సంబంధించి ఫీవర్ నడుస్తున్న పరిస్థితి లో బాహుబలి కంటే గొప్పగా వెయ్యి కోట్ల బడ్జెట్ తో మహాభారతం సినిమాని తెరకి ఎక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో అనేక మంది చర్చించుకుంటున్నారు. మలయాళం హీరో సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాలో ఆయన భీముడుగా కనిపిస్తే కృష్ణుడు గా మహేష్ బాబు కనిపించ బోతున్నాడు అని టాక్ వినపడుతోంది .
మహేష్ కానీ హ్రితిక్ కానీ అనుకుంటున్నారట కానీ మహేష్ ఈ పాత్రలో ఎంతవరకూ సెట్ అవుతాడు అనేది డౌట్ .. మహేష్ ఎప్పుడూ పౌరాణికం చెయ్యలేదు అలాంటి పాత్రల్లో సెట్ అవుతాడో లేదో కూడా తెలీదు.
శ్రీకృష్ణుడు పాత్రకోసం ముందు మహేష్ కంటే ఆయన భార్య నమ్రత ని ఒప్పించాలి అని ఈ సినిమా బృందం ప్రయత్నాలు మొదలు పెట్టింది. మ‌హేశ్ కానీ ఒప్పుకోకుంటే ఈ పాత్ర‌కు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌ను అడ‌గాల‌ని భావిస్తున్నార‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here