వివాహ సమయానికి సీతారాముల వయసు ఎంతో తెలుసా?

సీతారాములు ఎంతటి ఆదర్శ దంపతులో మనకు తెలియంది కాదు. హిందూ సాంప్రదాయంలో ఆదర్శదంపతులంటే సీతారాములే. అయితే ఇలాంటి ఆదర్శదంపుతుల వివాహంపై అజ్ణానులు రకరకాలుగా మాట్లాడుతుంటారు. ముఖ్యంగా సీత కంటే రాముడు చిన్నావడని చెబుతుంటారు. ఇది చాలా తప్పు అని పండితులు సూచిస్తున్నారు. వీరి వివాహం ఎక్కడో ఒక చోట వివాదం రగులుతున్న సందర్భంలో శ్రీమద్ రామాయణంలో వీరి వివాహం పై స్పష్టత వచ్చింది.
మిధిలాపుర నాయకుడైన జనక మహారాజు  యాగం కోసం భూమిని దున్నే సమయంలో పొలంటే ఓ పెట్టదర్శనమిస్తుంది. ఆ పెట్టెలో పసిపిల్ల కనిపించింది. నాగటి చాలులో లభించినందున ఆమెకు ‘సీత’ అని నామకరణము చేసి జనకమహారాజు, ఆయన భార్య సునయన అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకొన్నారు. కనుక సీత భూదేవి కుమార్తె అని అంటారు, శ్రీ సీతమ్మ జన్మనక్షత్రము ఆశ్లేష నక్షత్రము అని తెలుస్తోంది. ఇక సీతారాములు వివాహం చేసుకునే సమయంలో  రాముల వారికి 12 సంవత్సరాలు, సీతా దేవి వయసు 6 సంవత్సరాలు. అలా రాముల వారి కంటే సీతమ్మవారు 6 సంవత్సరాలు చిన్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here