నా పేరు సూర్య.. మన ఊరు ఇండియా

బన్నీ అలియాస్ అల్లు అర్జున్.. డీజేను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. అంతలోనే.. వక్కంతం వంశీతో సినిమాకు కమిట్ అయ్యాడు. అందులో జవాన్ గా నటిస్తున్నాడంటూ.. బన్నీ కేరెక్టర్ గురించి అప్పుడే ప్రచారం మొదలైంది. ఇంక ఈ సినిమాకు.. నా పేరు సూర్య.. మన ఊరు ఇండియా అన్న పేరును కూడా దాదాపు ఖరారు చేశారని సమాచారం.

టైటిల్ లోనే కాదు.. షూటింగ్ లోనూ వైవిధ్యం చూపించేందుకు మూవీ యూనిట్ ప్రయత్నిస్తోంది. జవాన్ కేరెక్టర్ కాబట్టి సహజత్వం మిస్ కాకుండా ఉండేందుకు.. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటి ఆర్మీ బలగం ఎక్కువగా ఉన్న చోట షూటింగ్ పూర్తి చేసేందుకు బన్నీ టీమ్.. అన్ని చర్యలు తీసుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here