దానం చేసే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

కక్కుర్తితో ఉన్నవాళ్లు తనదగ్గరున్న డబ్బుస్తే ఆస్తి కరిగిపోతుందని దానం చేయరు. తెలివైన వాడు దానం చేయకపోతే వచ్చే జన్మలో దరిద్రాన్ని అనుభవిస్తారని దానం చేస్తారు. ఇదే విషయాన్ని మనకు పెద్దలు చెబుతుంటారు. అయితే దానం చేయడంలో కొన్ని పద్దతులు పాటించాలని పురాణాలు చెబుతున్నాయి. దానం ఎలా చేయాలి.
దానం చేసేటప్పుడు ఇచ్చే వస్తువు ఏదైనా డబ్బులు కానీ, వస్తువు కానీ నాది కాదు అనుకొని దానం చేయాలి. దానం చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కవ దానం చేయలేకపోయాననే బాధ ఉండాలి. అహంకారంతో  నేను దానం చేస్తున్నాను అనే అభిప్రాయం మనసులో ఉండరాదు.
దానం చేయాలంటే ఏం కావాలి
ప్రతీ ఒక్కరు దానం చేస్తుంటారు. ఎదుటివారు మనకంటే తక్కువగా ఉన్నారని దానం చేయడం కాకుండా..దానం పొందే వ్యక్తి అందుకు అర్హుడా అనేది చూడాలి. మీరు డబ్బులు ఇస్తే వ్యసనం చేస్తే అది మీ తప్పు అవుతుంది. కాబట్టే దానం చేసేటప్పుడు ఉపయోగాన్ని బట్టి దానం చేయాలి.
అన్నం పరబ్రహ్మ స్వరూపం. దానం చేయడంలో అర్హతల్ని బట్టి దానం చేయాలని తెలుసుకున్నాం కదా. కానీ అన్నం మాత్రం అలా చూడకూడకుండా ఎవరికైనా పెట్టవచ్చు అనేది శాస్త్రాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here