హైద‌రాబాద్ లో కోట్లలో ప్లాస్టిక్ బియ్యం అమ్మ‌కాలు

తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ బియ్యం క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. చైనాలో త‌యారైన ఈ ప్లాస్టిక్ బియ్యాన్ని వ్యాపార‌స్థులు త‌మ లాభార్జ‌న కోసం అమ్మ‌కాలు ప్రారంభించారు. ఇలా అమ్మకాలు ప్రారంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కోటి విలువ చేసి బియ్యాన్ని అమ్మిన‌ట్లు పోలీసులు నిర్ధార‌ణ‌లో వెల్ల‌డైంది. అయితే కొనుగోలు దారులు బియ్యాన్ని కొనుగోలు చేసే స‌మ‌యంలో ప‌రిక్ష‌ల ద్వారా ఏవి ప్లాస్టిక్ బియ్యం అనేది క‌నిపెట్ట‌వ‌చ్చ‌ని అధికారులు తెలుపుతున్నారు.
ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ బియ్యాన్ని హైద‌రాబాద్ లో అమ్మాకాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయని…వ‌చ్చే ఫిర్యాదుల ఆధారంగా వెలుగులోకి వ‌చ్చింది. త‌క్కువ ధ‌ర‌కు బియ్యం వ‌స్తున్నాయ‌ని కొత్త ర‌కం బియ్యాన్ని కొనుగోలు చేయ‌వ‌ద్ద‌ని తెలంగాణ ఆరోగ్య‌శాఖ అధికారులు సూచిస్తున్నారు. బియ్యం కొనుగులు చేయాల్సి వ‌స్తే పాత త‌రం బియ్యాన్ని కొనుగోలు చేయాల‌ని..బియ్యం ప్యాక్ ల‌ను ప‌రిక్షించి చూడాల‌ని అంటున్నారు. ఇదిలా ఉండ‌గా ప్లాస్టిక్ బియ్యానికి, నాణ్య‌మైన బియ్యానికి తేడా తెలియక సామాన్యులు ఇబ్బందులు పాల‌వుతున్నారు.
బియ్యం కొనుగోలు చేయాలంటే జ‌డుస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బియ్యాన్ని కొనుగోలు చేసే ముందు ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించ‌క‌పోయిన‌..అన్నం వండిన త‌రువాత ప్లాస్టిక్ బియ్యం, నాణ్య‌మైన బియ్యానికి వ్య‌త్యాసం ఎలానో తెలుసుకోవ‌చ్చ‌ని ప‌లు సూచ‌న‌లు చేశారు.  ప్లాస్టిక్ బియ్యం తో వండిన అన్నం మ‌నం ఎంత క‌లిపితే అది అంత త‌రిగిపోతుంది. ఇలా ప్లాస్టిక్ బియ్యాన్ని పట్టేయ‌వ‌చ్చు.
వీటితో పాటు అన్నాన్ని బాగా క‌లిపి ఉండ‌గా చేయాలి. అనంత‌రం ఆ ఉండ‌ను బంతిలాగా ప‌రిక్షించాలి. ఒక‌వేళ ఆ అన్నం ఉండ ఎగురుతుంటే అది ప్లాస్టిక్ బియ్యం మ‌ని గుర్తించ‌వ‌చ్చ‌ని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here