హ‌మ్మ‌య్య నేను చ‌చ్చిపోలేదు

సంద‌ర్భాన్ని బ‌ట్టి ఎదుటి వారు హ‌ర్ట్ అవ్వ‌కుండా పంచ్ లు వేయ‌డంలో షారుఖాన్ దిట్ట‌. అయితే తాను చ‌నిపోయిన‌ట్లు నేష‌న‌ల్ మీడియాలో క‌థ‌నాలు ప్ర‌సారం కావడంతో రియాక్ట్ అయిన షారుఖ్ త‌న చావుకి కూడా కామెడీ మ‌సాలా ద‌ట్టించాడు. అంతే న‌వ్వుకోవ‌డం నెటిజ‌న్ల వంతైంది. కొద్దిరోజుల క్రితం ఓ ప్లైట్ క్లాష్ అవ్వ‌డంతో ఏడుగురు ప్ర‌యాణికులు మ‌ర‌ణించార‌ని..అందులో షారుఖ్ కూడా ఉన్న‌ట్లు ఎల్ ప‌యాస్ అనే టీవీ ఛాన‌ల్ క‌థ‌నాల్ని ప్ర‌చురించింది.

ఇదిలా ఉంటే షారుఖాన్ ప్ర‌స్తుతం ఇంతియాజ్, ఆనంద్ ఎల్ రాయ్ ల ద‌ర్శ‌క‌త్వంలో ది రింగ్ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో   యాక్సిండెంట్ జ‌రిగింది.ఆ ప్ర‌మాదం నుంచి షారుఖ్ భ‌య‌ట‌ప‌డ్డాడు. దీనిపై  ఎల్ ప‌యాస్ ఛాన‌ల్  షారుఖ్ చ‌చ్చిపోయాడంటూ క‌థ‌నాల్ని ప్ర‌సారం చేసింది. అంతే  త‌న చావు పై వ‌చ్చిన క‌థ‌నాల లింక్ ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి  ఉఫ్..విమాన ప్ర‌మాదం కాదు..షూటింగ్ స్పాట్ లో జ‌రిగిన యాక్సిడెంట్ నుంచి త‌ప్పించుకున్నా..డైర‌క్ట‌ర్ ఇంతియాజ్ కు మ‌రో సినిమా టైటిల్ దొరికిందంటూ న‌వ్వులు పువ్వులు పూయించాడు ఈ కింగ్ ఖాన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here