డైరెక్టర్ హరీష్ శంకర్ మాటలతో ఓకే అవ్వని బ్రాహ్మలు .. క్షమాపణ చెప్పాల్సిందే :

గుడిలో బడిలో పాట వివాదం ఇంకా ఇంకా ముదురుతోంది. డైరెక్టర్ హరీష్ శంకర్ మీడియా సాక్షిగా ఆ పాట గురించి వివరణ ఇచ్చిన తరవాత కూడా ఇంకా అతన్ని వదిలేలా కనపడ్డం లేదు బ్రాహ్మిన్ కమ్యూనిటీ వారు. ఎందరో భక్తులు, బ్రాహ్మణులు, పంతుళ్ళు నిష్టతో శివుడికి చేసేవి అన్నీ కూడా ఇష్టానుసారం గా రాసేసారు అంటూ అతనిమీద ఫైర్ అవుతున్నారు వారందరూ. ఇప్పటికే హరీష్ తన పాట లోని లిరిక్స్ మొత్తానికీ వివరణ ఇవ్వగా వారు దాంతో సాటిస్ఫై అయినట్టు కనపడ్డం లేదు.

నమకం, చమకం పదాలను ప్రేమగీతంలో పెట్టడం…శైవ భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని వారు మీడియా సాక్షిగా చెబుతున్నారు. ఆ సినిమా నుంచి తక్షణం పాట తీయకపోతే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి  నిర్మాత, దర్శకుడు, నటుల ఇంటి మీద దాడి చేస్తాం అని హెచ్చరించారు వారు. వైజాగ్ లో ఒక బృందం , హైదరాబాద్ లో ఒక బృందం ఈ పాట విషయం లో గట్టిగా నిరసన తెలియ జేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here