స్పైడర్ టీజర్ సౌత్ ఇండియా రికార్డు .. ఫేక్ రికార్డ్ ?

బాబు ఎంటర్ అయితే అపోజిషన్ కి బ్యాండ్ ఏ అన్నట్టు ఉంది స్పైడర్ టీజర్ హడావిడి. వివేగం సినిమా టీజర్ రికార్డుని మహేష్ బాబు తన స్పైడర్ తో అలవోకగా దాటేసాడు. కేవలం ఇరవై నాలుగు గంటల్లో అరవై మూడు లక్షల మంది ఈ టీజర్ ని చూడడం చాలా పెద్ద విశేషంగా చెప్పచ్చు. ఇప్పటి వరకూ వివేగం , కబాలి టీజర్ లకి మాత్రమె ఉన్న రికార్డు మహేష్ తన పేరిట రాసుకున్నాడు. ఒకపక్క సూపర్ టీజర్ వచ్చిన సంతోషంలో ఉన్న మహేష్ ఫాన్స్ కి ఈ కొత్త రికార్డ్ ఫుల్ ఖుషీ ఇస్తోంది.

మరొక పక్క మహేష్ యాంటీ ఫాన్స్ మాత్రం స్పైడర్ టీజర్ రికార్డు ఫేక్ అనీ , ఇంటర్నెట్ లో మహేష్ ఫాన్స్ బోలెడు ఫేక్ యూట్యూబ్ చానల్స్ సృష్టించి వాటి దారా వ్యూస్ లైక్స్ పెంచుతున్నారు అనీ అంటున్నారు. గంటల వ్యవధి లో ఇలా రావడం అసాధ్యం అనీ వివేగం టైం లో కూడా ఫేక్ బాగా పడ్డాయి అనేది కొందరి వాదన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here