చైనా బిచ్చగాడు .. అక్కడ జనాలకి చుక్కలు చూపిస్తున్నాడు :

తెలుగు సినిమా జనాలు మరొక పది పదిహేను సంవత్సరాల పాటు బిచ్చగాడు సినిమాని మర్చిపోలేరు అంటే అది అతిశయోక్తి కాదేమో. అంతగా తెలుగు సినిమా పరిశ్రమ లో ఆ చిత్రం సంచలనాలు సృష్టించింది. చాలా మంది ఈ సినిమా విడుదల కి ముందు కామెడీ చేసినా బ్రహ్మోత్సవం లాంటి స్టార్ స్టేటస్ సినిమాని సైతం బిచ్చగాడు దూసుకుని దాటుపోయింది. మొదట రెండు కోట్లు అనుకున్న కలక్షన్ లో టోటల్ గా పాతిక కోట్లు కలక్ట్ చేసాయి.

ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ లో కొత్త అధ్యాయం కి తెర లేపింది. సరిగ్గా ఇప్పుడు చైనాలో ‘దంగల్’ కూడా ఇలాగే చరిత్ర సృష్టించింది. చైనాలో ఇండియన్ సినిమాలకు ఎప్పుడూ పెద్ద మార్కెట్ లేదు. కానీ దంగల్ సినిమా అసలు అంచనాలు లేకుండా నే మౌత్ పబ్లిసిటీ తో సూపర్ గా కలక్షన్ లు సాధిస్తోంది. మొదట వంద కోట్లు ఎక్కువ అనుకున్నారు ఇప్పుడు అక్కడ ఈ చిత్రం వెయ్యి కోట్ల మైలు రాయి ని దాటేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here